గత ఏడేళ్ళుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న” రన్ ఫర్ జీసస్ “ ఈసారి కూడా ఘన్నగా విజయవంతమైంది. శనివారం నాడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉదయం 6 గంటలకు ఒకే సమయములో 400 చోట్ల రన్ ఫర్ జీసస్ ర్యాలి నిర్వహించారు. సిటీలో బషీర్బాగ్ వద్ద ప్రారంభమైన ర్యాలి ట్యాంక్ బండ్ మీదుగా లాల్ బహదూర్ స్టేడియo వరకు సాగింది. ఇరిగేషన్ మినిస్టర్ టి. హరీష్ రావు గారు ఈ ర్యాలిని ప్రారంబించారు.ఈ ర్యాలిలో వేలాది మంది క్రైస్తవులు పాల్లుగోన్నారు.
గుడ్ ఫ్రైడే, ఈస్టార్ పండుగులకు వారధీగా పవిత్ర శనివారం నాడు ఈ రన్ ను నిర్వహిస్తామని, క్రీస్తుకు శిలువ, క్రీస్తు పునరుత్దానం ప్రాధాన్యత గురించి తెలియ జేయడమే ఈ రన్ ఫర్ జీసస్ ఉద్దేశము అని నిర్వాహకులలో ఒకరైనా పాల్ దేవా ప్రియం తెలిపారు. మినిస్టర్ టి. హరీష్ రావు గారు మాట్లాడుతూ,క్రీస్తు సందేశము ఈ లోకానికి ఎంతో అవశ్యమని అన్నారు.
ప్రముఖ హిందీ సువార్త గాయకులూ శ్రీ విజయ్ బెనెడిక్ట్ మరియు వారి బృందం స్తుతి ఆరాధన తో ఈ కార్యక్రమాన్ని ముగిచారు.