‘సలార్’ సినిమాతో మళ్లీ ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది శ్రుతి హాసన్. నిజానికి సలార్ సినిమాలో కనిపించింది చిన్న పాత్రలో అయినా, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శ్రుతి హాసన్. పైగా తనదైన గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేయడంలో శ్రుతి హాసన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. దీంతో, ఈ అమ్మడుకి నార్త్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇకేకుంది అదే రేంజ్ రూమర్స్ కూడా వస్తన్నాయి. ఇప్పటికే పలు భారీ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది శ్రుతి హాసన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా శ్రుతి హాసన్ పై మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది అదేంటంటే.. బాలీవుడ్ సినీ చరిత్రలో ఆషీకీ సినిమాని కల్ట్ క్లాసీగా చెప్పుకుంటారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఆషీకీ 2కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆదిత్య రాయ్ కపూ, శ్రద్ధ కపూర్ జంటగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ఆషీకీ 3కూడా తెరకెక్కనుందట. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తుండగా.. ఓ కీలక పాత్రలో శ్రుతి హాసన్ ని తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే, శ్రుతి హాసన్ కు నార్త్ లో ఫుల్లు ఫాలోయింగ్ రావటంతో ఆ రకంగా కూడా వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ న్యూస్ అయినా నిజమా, లేక రూమర అనే కామెంట్స్ వస్తున్నాయి ఆడియన్స్ నుండి. మరి నిజంగా ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి అవకాశం వచ్చిందంటే లక్ అనే చెప్పాలి. మొత్తమ్మీద లేటు వయసులో శ్రుతి హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అనుకోవాలి.
Also Read:అరటి పువ్వు తినడం మంచిదేనా?