Rashmika:రష్మికతో పుకార్లు నిజం కావు అట

18
- Advertisement -

రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ డేటింగ్ వదంతులపై ఇప్పటికే ఎన్నో పుకార్లు వినిపించాయి. పైగా రష్మిక మందన్నాతో డేటింగ్ కోసమే విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీకి దూరం అయ్యాడని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను రష్మిక మందన్నాతో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై రియాక్ట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత జీవితంపై అనవసర వాగుడుని నేను పట్టించుకోను. అసలు ఏముందని నేను బాధ పడడానికి ? అంటూ విజయ్ దేవరకొండ ఎదురు ప్రశ్నించాడు.

విజయ్ దేవరకొండ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ప్రతి దశలోనూ నేను ఎంతో కష్టపడ్డాను. మీరు నా గురించి తెలుసుకోవాలంటే నా ప్రతిభను చూడండి. నా శ్రమను చూడండి. నేను పడే కష్టం ఎంతో అమూల్యమైనది. అయినా, ఎవరో బయట వ్యక్తులు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఏమిటి?, అసలు రష్మిక మందన్నా ఒక మంచి నటి. అంతకు మించి ఆమె నాకు మంచి స్నేహితురాలు. అలాంటి ఆమెతో నన్ను కలిపి పుకార్లు రాస్తున్నారు. అవన్నీ నిజం కాదు’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఇక మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు.. ఒదిగి ఉండే అమ్మాయి తనకు కావాలి అంటూ విజయ్ దేవరకొండ తెలిపాడు. అలాగే, తనతో పాటు తన ఫ్యామిలీతో కూడా నన్నిహితంగా ఉంటూ, అర్థం చేసుకునే అమ్మాయి కావాలని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. లైగర్ లో చివరిసారిగా కనిపించిన విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు.

Also read:గంజాయి కేసులో బిగ్ బాస్ షణ్ముఖ్ అరెస్ట్..

- Advertisement -