ప్రభాస్ నిశ్చితార్థం..!

73
- Advertisement -

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్. రెబల్ స్టార్ పెళ్లిపై ఎప్పటినుండో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ క్రిటిక్ బాలీవుడ్ ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రభాస్ తర్వలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అతను ట్విట్టర్లో రివీల్ చేశాడు.

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోనున్నాడని…వీరిద్దరి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నానని పేర్కొనగా ఇది వైరల్‌గా మారింది. దీంతో దీనిపై ప్రభాస్ టీం స్పందించింది. ఉమైర్ సంధు కథనాల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. ప్రభాస్, కృతి సనన్ నిశ్చితార్థ వార్తల్లో వాస్తవం లేదని..కొందరి ఉత్సాహం మాత్రమే అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -