మారుతి..నెక్ట్స్‌ సినిమా ఎవరితో తెలుసా?

5
- Advertisement -

దర్శకుడు మారుతి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ప్రభాస్ అభిమానులకు కూడా ఈ సినిమా ఒక సాధారణ అనుభూతిగానే మిగిలింది. అయితే మారుతి ముందుగానే ‘రాజా సాబ్ 2: సర్కస్ 1935’ అనే సీక్వెల్‌ను ప్రకటించినప్పటికీ, అది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లబోతుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, మారుతి తదుపరి ప్రాజెక్ట్ మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఉంటుందని, ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ ప్రచారం పెరగడంతో మారుతి టీమ్ స్పందిస్తూ, ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. మారుతి తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదైనా ఉంటే, అది నేరుగా దర్శకుడే ప్రకటిస్తాడని కూడా వారు తెలిపారు.

Also Read:టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదం

- Advertisement -