విపక్షాలకు షాక్‌..పార్టీనేతలకు సర్‌ప్రైజ్..కేసీఆర్‌ వ్యూహం ఇదేనా..!

208
kcr
- Advertisement -

సాధారణ ఎన్నికలకు ఇంకా టైం ఉన్న ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానని ప్రకటించి విపక్షాలకు షాకిచ్చిన సీఎం కేసీఆర్ అంతే స్పీడుతో తొలిజాబితాలోనే వందమంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్‌ హీట్ పెంచేశారు. కేసీఆర్‌ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరైన విపక్షాలకు ఎన్నికల తర్వాత కొలుకోలేని దెబ్బతగిలింది. ప్రజలు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తూ తిరుగులేని విజయాన్ని అందించారు.

ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ ఇదే వ్యూహాన్ని అనుసరించబోతున్నారట సీఎం కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ,ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి పార్టీ నేతలకు సర్‌ప్రైజ్ ఇచ్చేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.

కీలక నిర్ణయాలకు కలిసొచ్చిన పాంహౌజ్‌లో కేబినెట్‌, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులపై సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు కేసీఆర్. త్వరలోనే 16 మంది మంత్రులు, 16 మంది లోక్‌సభ అభ్యర్థులు, 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నారట కేసీఆర్‌. ప్రస్తుతం ఈ వార్త టీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. అన్నికుదిరితే ఈ నెల 16నే ప్రకటన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వార్తలకు బలం చేకూరేలా త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించిన వెంటనే కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు వెళ్లడం హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలంగాణ ఉద్యమ వ్యూహరచన, ఢిల్లీ పర్యటనలు, 2014, 2019 ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కసరత్తు కూడా ఫాంహౌజ్‌ కేంద్రంగానే సాగింది. అన్ని ప్రచార సభలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అందుకే మరోసారి తన నిర్ణయాలకు కలిసొచ్చిన ఫౌంహౌజ్ నుండే శుభవార్తను అందించనున్నారట.

- Advertisement -