ప్రభాస్ నుంచి మరో సీక్వెల్ మూవీ

28
- Advertisement -

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. మారుతి కూడా సీక్వెల్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడట. ప్రభాస్ నటించిన బాహుబలి రెండు పార్టులు హిట్ అవడంతో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ ను రెండు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నాడు. కాకాపోతే, సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీని సుకుమార్ ఆల్ రెడీ రెండు పార్ట్ లుగా తీసుకోస్తున్నాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని దర్శకుడు మారుతి కూడా ఫాలో అవుతున్నాడని టాక్ నడుస్తోంది.

ప్రభాస్ తో తన సినిమాని ఒక పార్ట్ గానే మొదలు పెట్టినా షూటింగ్ మిడిల్ లోకి వచ్చేసరికి రెండు పార్టులుగా చేస్తే బాగా క్యాష్ చేసుకోవచ్చు అని మారుతి ఫీల్ అయ్యాడట. సహజంగానే మారుతి చాలా కమర్షియల్ దర్శకుడు. లాభాల విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తాడు. అందుకే, మారుతి నుంచి రీసెంట్ గా వచ్చిన డిజాస్టర్ మూవీ పక్కా కమర్షియల్ మూవీ కూడా లాభాలను చవిచూసింది. ఇది సినిమా మార్కెట్ పై మారుతికి ఉన్న విజన్. సో.. ప్రభాస్ తో తానూ చేస్తున్న సినిమాని రెండు పార్ట్ లుగా చేస్తా అని చెప్పగానే ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడు అని తెలుస్తోంది.

కానీ, మారుతి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. అలాంటి దర్శకుడు ఒక సినిమా కోసం రాసుకున్న కథను రెండు భాగాలుగా విడుదల చేస్తే.. హిట్ అవుతుందా ?, అసలు ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో !!. కానీ, మారుతి మాత్రం తాను కథ రాసుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను.. తన కథలో ప్రభాస్ పాత్రతో పాటు అన్ని స్ట్రాంగ్ కేరెక్టర్స్ అని, అందుకే, షూటింగ్ చేస్తున్నప్పుడు అందులో పాత్రలను పెంచేస్తూ వెళ్తున్నాను అని, కాబట్టి రెండు పార్ట్ లుగా తన సినిమాని తీసుకురావాలని మారుతి ఆలోచనలో ఉన్నాడట. మరి ఏమవుతుందో చూడాలి.

Also Read:దేవర ఈ సోదేంది బాసూ?

- Advertisement -