నయనతార 2023 తర్వాత నుంచి ఇక నటించదంటూ ఈమధ్య మీడియాలో ప్రచారం బాగా ఎక్కువైంది. పెళ్లి అయ్యాక, ఎక్కువగా ఇంటికే పరిమితమైన నయనతార తన పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. కాల్షీట్లు కూడా ఆచితూచి ఇస్తోంది. అది కూడా అయిష్టంగానే. పిల్లలు పుట్టక ముందు ఒప్పుకున్న సినిమాలు తప్ప నయనతార కొత్తగా ఏ అసైన్‌మెంట్ టేకప్ చేయలేదు. మొత్తానికి తన పిల్లలకు దగ్గరగా.. సినిమాలకు దూరంగా వుంటోంది.
అందుకే..నయనతార పూర్తిగా సినిమాలు మానేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ లాంటి స్పెషల్ సినిమాలైతేనే నయనతార చేస్తుందని మరో టాక్ వుంది. ఇంకోవైపు భర్త విగ్నేష్ శివన్ తో కలిసి మరో సొంత నిర్మాణ సంస్థ పెడుతోందని, తనకు నచ్చిన సినిమాలను నిర్మిస్తుందని మరో గాసిప్ కూడా సర్కులేట్ అవుతోంది.
ఇలా తన గురించి ఇలా చాలా రకాల ఊహాగానాలు సాగుతున్నా కానీ, నయనతార మాత్రం దేనికీ ఊఁ కొట్టడం లేదు. అలా అని ఖండించడం లేదు. 38 సంవత్సరాల నయనతార మరి ఇక నటన తగ్గించేసి గృహిణి బాధ్యతలేక పరిమితం అవుతుందా ?, లేక సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఫాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందా, అది కాకపోతే.. నిర్మాతగా మారి తన అభిరుచిని చాటుకునే సినిమాలు చేస్తుందా ? సమాధానం కోసం నయనతార పెదవి విప్పే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..