‘రూలర్’ టీజర్‌కు ముహూర్తం ఖరారు..

696
ruler
- Advertisement -

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి `రూల‌ర్`. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ.

balakrishna

ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్‌ రోల్‌లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 4.28 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రటించారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

Hero Nandamuri Balakrishna’s 105th film is titled ‘RULER’. He is playing the role of a powerful police officer and so we can see him in khakee uniform in..

- Advertisement -