- Advertisement -
రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం కాంతార. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టగా ఈ సినిమాకు సీక్వెల్‌గా రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రిక్వెల్ అయిన కాంతార చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న భారీగా థియేటర్లలో విడుదల కానుంది.
షూటింగ్ పూర్తవగా, మేకర్స్ ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. శాండల్‌వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ పోస్టర్‌లో రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో అద్భుతంగా మెరిసారు. పోస్టర్ చూస్తుంటే ఆమె ఓ రాజకుమార్తె పాత్రలో నటిస్తున్నారని అర్థమవుతోంది.
అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, ఈ భారీ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
Also Read:TTD:9న గరుడ సేవ ట్రయల్ రన్
- Advertisement -

