Toxic:మెలిస్సాగా రుక్మిణి!

6
- Advertisement -

యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’.ఇప్పటివరకు ఈ సినిమాలోని పలువరు ప్రముఖుల పాత్రలకు సంబంధించి లుక్స్‌ని విడుదల చేయగా తాజా నటి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె మెలిస్సా (Mellisa) అనే పాత్రలో కనిపించనుండగా, ఆమె లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ ఫస్ట్ లుక్‌తో టాక్సిక్ చిత్రంలో నటిస్తున్న ప్రధాన నటీమణులందరి పరిచయ పోస్టర్లు పూర్తయ్యాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, యష్ పుట్టినరోజు సమీపిస్తుండటంతో, ఆ సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా, 2026 మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్‌

- Advertisement -