రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం 2025లో భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ.800 కోట్ల వసూళ్లతో కన్నడ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది.
ఈ ప్రీక్వెల్‌లో మహిళా ప్రధాన పాత్ర పోషించిన రుక్మిణి వసంత్, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ప్రతినాయక పాత్రలో కనిపించారు. ఈ పాత్ర గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి పాత్ర చేయడం చాలా ప్రమాదకరమైన నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.
కాంతార చాప్టర్ 1లో ప్రతినాయక పాత్ర పోషించడం నా కెరీర్ ప్రారంభ దశలో చాలా ప్రమాదకరమైన ప్రయోగం. నా జీవితమంతా నెగటివ్ పాత్రలే చేయాల్సి వస్తుందేమోనని అప్పట్లో అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రజలు నా విలన్ పాత్రను ఇష్టపడ్డారని, నన్ను ద్వేషించలేదని చెబుతున్నారు. అందుకే ఇక భయపడాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ పాత్ర రావడమే దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ పాత్రతో రుక్మిణి తన నటనా వైవిధ్యాన్ని చాటడంతో పాటు, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు.
Also Read:ఛాంపియన్ మూవీ..ఆనందంగా ఉంది!

