సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్, విభీష, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా 200 థియేటర్స్ కు పైగా విడుదలై పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో చిత్ర టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు, నటి జయలలిత మాట్లాడుతూ…“మా రుద్రంకోట` చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ మా టీమ్ అందరి తరఫున ధన్యవాదాలు. అలాగే మీడియా వారు కూడా మా చిత్రానికి మంచి పబ్లిసిటీ ఇచ్చి పబ్లిక్ లోకి తీసుకెళ్లారు. విడుదలైన అన్ని ఏరియాల నుండి మంచి స్పందన వస్తోంది. కథ, కథనాలతో పాటు సంగీతం, దర్శకత్వం, నటీనటుల పర్ఫార్మెన్స్ , నా పాత్ర ఇలా ప్రతి అంశం గురించి ఆడియన్స్ మాట్లాడుతున్నారు. చూడని వారు మా చిత్రాన్ని చూసి ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
దర్శకుడు రాము కోన మాట్లాడుతూ…` మా చిత్రాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లి…మంచి రివ్యూస్ రాసి మాకు ఎంతో సపోర్ట్ చేస్తోన్న పాత్రికేయులకు ధన్యవాదాలు. జయలలిత గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈ రోజు మాకు దక్కింది. అందరికీ థియేటర్స్ దొరకడం పెద్ద సమస్యగా మారింది .. మాకు మాత్రం అలాంటి సమస్య లేకుండా స్క్రీన్ మాక్స్ వారు 200 థియేటర్స్ లో భారీగా రిలీజ్ చేశారు. ఇటీవల గుంటూరు లో కొన్ని థియేటర్స్ సందర్శించాం. చాలా మంచి స్పందన వస్తోంది. బి.గోపాల్ , కాట్రగడ్డ మా చిత్రాన్ని మెచ్చుకోని నాక సన్మానం చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మా చిత్రాన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా“ అన్నారు.
Also Read:పిక్ టాక్ : కసిగా చూస్తూ ఊరిస్తున్న శ్రీముఖి
హీరోయిన్ విభీష మాట్లాడుతూ…“హిట్ సినిమాలో నేను కూడా నటించడం ఎంతో సంతోషంగా ఉంది. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా హిట్ అయిందంటే దర్శకుడు రాము గారి హార్డ్ వర్కే కారణం. జయలలిత గారి నాకు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేనిది“ అన్నారు.
హీరో అనిల్ మాట్లాడుతూ…“కంటెంట్ ఉంటే కొత్తవాళ్లనైనా ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి మా సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. విడుదలైన అన్ని ఏరియాల నుంచి సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. శ్రేయాస్ మీడియా శ్రీను అన్న మా చిత్రానికి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే జయలలిత అమ్మగారు నాకు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు.
Also Read:ఆ నటి మళ్లీ పెళ్లి.. నిజమేనా ?