- Advertisement -
తమిళనాట ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ వాతావరణం హీటెక్కుతోంది.ఈసారి డీఎంకే – అన్నాడీఎంకేలకు పోటీగ విజయ్ టీవీకే కూడా గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్నికల్లో తొలిసారి విజయ్ టీవీకే బరిలోకి దిగుతుండటంతో అందరి దృష్టి నెలకొనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన IRS అధికారి అరుణ్ రాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తమిళనాడు మరియు బీహార్ రాష్ట్రాలలో ఆదాయపు పన్ను శాఖలో సహాయ కమిషనర్ మరియు సంయుక్త కమిషనర్ హోదాల్లో సేవలందించారు.
అయితే తాజాగా అరుణ్ రాజ్ తమిళ వెట్రిక కజగం..టీవీకేలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా TVK అధ్యక్షుడు విజయ్ కు ఆయన సలహాలు ఇస్తున్నారని కూడా సమాచారం.
Also Read:అలర్ట్.. భారీ వర్షాలు
- Advertisement -

