రేపటితో ఆర్టీసీ కార్మికులకు విధించిన డెడ్‌లైన్ ముగుస్తుండటంతో పెద్ద ఎత్తున్న విధుల్లో చేరుతున్నారు కార్మికులు. రెండోరోజు పెద్ద ఎత్తున డిపోలకు చేరుకుంటున్న కార్మికులు బేషరతుగా విధుల్లో చేరుతున్నామని లేఖలు ఇస్తున్నారు.
వికారాబాద్ ఆర్ టీసీ డిపో లో ఎం,.ఆంజనేయులు(ఐడీ 919775) విధుల్లో చేరగా కరీంనగర్ జిల్లా ఒకటో డిపోకు చెందిన ఎండీ గౌస్ బాష డ్రైవర్(321862) విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన భరోసాతో, మంత్రి గంగుల ప్రోద్బలంతో విధుల్లో చేరుతున్నానని మిగితా కార్మికులు కూడా డ్యూటీలో చేరాలని గౌస్ పాషా పిలుపునిచ్చారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన కండక్టర్ బి.సురేష్ కుమార్(207931) విధుల్లో చేరారు. ఇవాళ ఉదయం 10.20 గంటలకు ఉప్పల్ డిపోలో రిపోర్ట్ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో లోఆర్టీసీ సూపరింటెండెంట్ ఏ శ్రీహరి విధుల్లో చేరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో యం సంధ్యారాణి 322902 మెకానికల్ ఫోర్ మెన్ డ్యూటీలో జాయిన్ అయ్యారు.