విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల వివరాలు ఇవే..

371
Rtc Employes
- Advertisement -

గత నెల 5వ తేది నుంచి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరుగా ఇవాళ స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరుతున్నారు. ఆయా డిపోల్లో మేనేజర్లకు వినతి పత్రం అందించి డ్యూటిలకు హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు వారు ఉద్యోగంలో చేరేందుకు సన్నద్దమౌతున్నారు. నవంబర్‌ 5 అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరితే, వారి భవిష్యత్‌ బాగుపడుతుందనీ.. అడ్డగోలు యూనియన్ల నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని, కుటుంబాల్ని నాశనం చేసుకోవద్దని సీఎం సూచించారు. విధుల్లో చేరకపోతే మళ్లీ తీసుకునేది లేదని ఆయన కరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే. భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ డిపోల వద్దకు కార్మికులు విధుల్లో చేరేందుకు సన్నద్దమై వచ్చారు

ఉదయం నుంచి డ్యూటీలో చేరిన వారి వివరాలు..

హన్మకొండ డిపో 1 అసిస్టెంట్ మేనేజర్ టి సూర్యప్రకాష్.

మిర్యాలగూడ డిపో కండక్టర్ SK వలి అ

సిద్దిపేట డిపో కండక్టరు P. బాల విశ్వేశ్వరరావు

సిరిసిల్ల డిపో మెకానిక్ K.. శ్రీనివాస్

కేశవ కృష్ణ, Asst డిపో మేనేజర్, ఉప్పల్ డిపో

- Advertisement -