- Advertisement -
హైదరాబాద్ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్ల తో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. సమావేశం అనంతరం మాట్లాడిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్… ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశం జరిగింది.వాళ్లు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఒక వారం రోజుల్లో వారి సమస్యల పరిష్కారం చేస్తాం …ఇందుకోసం కమిటీ వేస్తామని తెలిపారు.
రేపటి నుంచి యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయన్నారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని…సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్నారు. సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతాం అని వెల్లడించారు సజ్జనార్.
Also Read:త్వరలో విశాఖ టూ సింగపూర్‌కి క్రూయిజ్ సేవలు
- Advertisement -