ప్రభుత్వ బెదిరింపులకు భయపడం:ఆర్టీసీ కార్మికులు

15
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్.టి.సి కార్మికులకు జీతాలు పడలేదు అన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి. ఈ నెల 4 వ తేదీ నుండి 10 తేదీ వరకు జోన్ , జిల్లా వారిగా క్యాడర్ వైజ్ విభజించి వేయడం సరైనది కాదు అని ఆర్.టి.సి జాక్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఈరోజు 10 తేదీ అయిన కూడా ఇంతవరకు కొంతమందికి జీతాలు రాకపోవడం చాలా బాధాకరం అని ఆర్.టి.సి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…ఇది కేవలం కక్షసాధింపు దిశగా ఉన్నట్టు అనిపిస్తుందని యూనియన్ JAC స్పష్టం చేశారు అన్నారు.

Also Read:వరంగల్ సభకు తరలిరండి: చింత ప్రభాకర్

ఇలా ఎన్ని భయపెట్టాలని చూసిన మా సమ్మె చేయడం తధ్యం అని JAC నాయకుడు థామస్ రెడ్డి ప్రభుత్వనికి హెచ్చరించారు. ఇప్పటికే చాలి చాలని జీతాలతో ఇబ్బంది పడుతుంటే… ఇప్పుడు జీతాలు వేయడం ఆలస్యం వల్ల మరింత ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుందని ఆర్.టి.సి కార్మికులు లోలోపల
మదనపడుతున్నారు అని తెలిపారు.

- Advertisement -