ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో కలిసి కూర్చొని అన్నప్రసాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది.
మోహన్ భగవత్‌తో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కూడా అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలో నిర్వహణ ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు వివరించారు. టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించినట్లు సమాచారం.
తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఒక విశిష్ట సంప్రదాయమని, ఇది సామాజిక సమానత్వం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోందని మోహన్ భగవత్ అభిప్రాయపడినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రసాదం పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు.
Also Read:Rewind 2025:ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులు వీరే!

