సిర్పూర్ నుండి ఆర్‌ఎస్పీ..పాలేరు నుండి షర్మిల

52
- Advertisement -

రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల హడావిడి నెలకొంది. ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే తమ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుండగా బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఎన్నికల క్షేత్రంలో దిగారు. వచ్చే ఎన్నికల్లోతాను సిర్పూర్ నుండి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో “గడపగడపకు బీఎస్పీ” కార్యక్రమంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశంలో, రాష్ట్రంలో బీజేపీని తన్ని తరిమేయాలని… మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోశాకా.. సీఎం అతని కాళ్ళు కడగడం విడ్డురంగాఉందన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు.

Also Read:ఘనంగా లష్కర్ బోనాలు…

ఇక వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుండగా మరోసారి ఆమె పాలేరు నుండి బరిలో దిగుతానని స్పష్టం చేశారు. త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే పాలేరులో పార్టీ ఆఫీస్‌ని సైతం ఓపెన్ చేశారు షర్మిల.

Also Read:CM KCR:మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధం

- Advertisement -