RSP:ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన

13
- Advertisement -

రాష్ట్రంలో ప్రజా పాలన అన్నారు కానీ ప్రజలపైన, నిరుద్యోగుల పైన ప్రతీకార పాలన నడుస్తుందన్నారు బీఆర్ఎస్ నేత, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ..రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టి శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యా శాఖ మంత్రి లేడు అన్నారు.

విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారు అన్నారు.

Also Read:వన మహోత్సవంలో పాల్గొనండి..పవన్ పిలుపు

- Advertisement -