కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్పీ ప్రవీణ్ కుమార్. ప్రాజెక్టు పిల్లర్‌కు పగుళ్లు రావు.. క్రస్ట్ గేట్లకు వస్తే రావొచ్చేమో కానీ ఒక ఇంట్లో పిల్లర్లకు పగుళ్లు రావు.. ఉష్ణోగ్రత తేడాతో గోడలకు పగుళ్లు వస్తాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కటే 20వ నెంబర్ పిల్లర్‌కి క్రాక్ వచ్చిందంటే, కచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి అన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పట్ల సంచలన ఆధారాలు బయటపెట్టారు ఆర్‌ఎస్పీ. 2023వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6:20 గంటలకు, మేడిగడ్డ పిల్లర్ల వద్ద భారీ శబ్ధాలు వచ్చాయని ఆరోపించారు మేడిగడ్డ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్.. ఈ మేరకు 2023 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారన్నారు.
ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్ పట్ల చర్యలు ఎందుకు తీసుకోలేదు? చెప్పాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్.
Also Read:బర్త్ డే గిఫ్ట్‌గా యూరియా బ్యాగ్!

