RSP:బ్యూరోకాట్సా..అధికార పార్టీ ప్రతినిధులా?

8
- Advertisement -

బ్యూరోక్రాట్ సహోద్యోగులారా, దయచేసి అధికార పార్టీకి అధికారిక ప్రతినిధులుగా వ్యవహరించకుండా ఉండండి అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో కోరిన ఆర్‌ఎస్పీ..గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు 2014 నుండి 2023 వరకు అర్హులైన పేద ప్రజలకు 6.47 లక్షల రేషన్ కార్డులను జారీ చేసింది అని ఆర్ఎస్పీ గుర్తు చేశారు.

రాష్ట్ర సివిల్ సస్లైస్ క‌మిష‌న‌ర్‌ డీఎస్ చౌహాన్‌.. ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్ర‌తినిధిలాగా మారిపోవ‌డాన్ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తప్పుబ‌ట్టారు. దయచేసి రికార్డుల‌ను వెరిఫై చేసి.. వాటికి అనుగుణంగా మీ సంబంధిత మంత్రులకు మార్గనిర్దేశం చేయండి అని సూచించారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2016 నుండి 2023 వరకు ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479. ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం దాచి అబద్ధాలు చెప్పడం సబబేనా అని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

 

Also Read:బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ఫోకస్!

- Advertisement -