RSP: బీఆర్ఎస్ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కండి

5
- Advertisement -

తెలంగాణ చరిత్రలో ఈ దీక్ష దివస్ పవిత్రమైన దినం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఇంఛార్జీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి లైవ్ లో ఈ కార్యక్రమాన్ని చూసున్న వెన్నుపోటు నాయకులకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల పాలనలో కెసిఅర్ వేసిన ఆనవాళ్లను తీసివేయడం ఎవరి తరం కాదు అన్నారు.

నవంబర్ 29 న ఐతే జైత్ర యాత్ర లేదంటే శవ యాత్ర అని ముందుకు సాగిన ఉద్యమ నేత కెసిఅర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో అమరులైన గడ్డ కామారెడ్డి గడ్డ..ఎన్నో త్యాగాలు చేసిన ప్రాంతం కామారెడ్డి ప్రాంతం అన్నారు. ఇప్పుడున్న తరానికి తెలంగాణా చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది..తెలంగాణ తొలి విడుత 1959 వ సంవత్సరంలో 369 మంది అమరులైన తెలంగాణ రాష్ట్రం సిద్దించలేదు అన్నారు.

కవితను ఈడి కేసులో నరేంద్ర మోడీ జైలుకు పంపినా కెసిఅర్ లొంగలేదు…తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల ప్రజలు జరుపునే పండుగ ఈ దీక్షా దివస్ అన్నారు.ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం..ఎన్నో అభివృద్ధి పనులు చేసిన కెసిఅర్ ను విమర్శించే హక్కు రేవంత్ రెడ్డికి ఉన్నదా అన్నారు. మళ్ళీ మత కల్లోలాలు చేసి రాష్ట్రంలో చిచ్చుపెట్టే బిజెపి పార్టీ గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం మన కార్యకర్తలకు ఉంది….కేటీఆర్ పోరాటాల ఫలితంగా 100 కోట్ల రాష్ట్ర ఆదాయం అదానీ పాలు కాకుండా అడ్డుకున్నాం అన్నారు.

మళ్ళీ రాష్ట్ర ఆదాయం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు చూస్తున్నాయి…ప్రతి కార్యకర్త మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.

Also Read:లగచర్ల భూసేకరణ వెనక్కి..ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -