కేసీఆర్ తెలంగాణ తొలి సీఎం గా సంపద పేద వాళ్ళ చేతిలో ఎలా పెట్టాలి అని ఆలోచించే వారు అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపద నంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ..కాంగ్రెస్ అంటేనే కుంభ కోణాల పార్టీ ,కమిషన్ల పార్టీ ..తాజాగా జీవో 17 తెచ్చి కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడ్డారు ..దాదాపు 600 కోట్ల రూపాయల కుంభ కోణం ఇది అన్నారు.
20 వేల మంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకు జీవో 17 తెచ్చారు ..గురుకులాలు ,కేజీవీబీ ,ఇతర స్కూళ్లల్లో ఫుడ్ కాంట్రాక్టర్ల ను మార్చేందుకు నిబంధనలను సడలిస్తూ జీవో 17 ఇచ్చారు ..ఈ జీవో తో 20 వేల మంది వాళ్ళ మీద ఆధార పడే లక్ష మంది రోడ్ల మీద పడతారు …ఫుడ్ కాంట్రాక్టర్లు 50 లక్షల ఇ ఎం డి కట్టాలట ..పది తరాలు కష్టపడ్డా చిరు వ్యాపారులకు అంత డబ్బు రాదు …మండలం ఒక యూనిట్ గా ఓకే బడా కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది..ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు కేసీఆర్ హయం లో రాయితీ ఉండేది ..ఖర్గే ఎక్కడున్నారు ,దళిత మంత్రులు ఎక్కడ ఉన్నారు …చేవెళ్ల డిక్లరేషన్ లో 25 శాతం దళితులకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు అది అమలు కాకపోగా వాళ్ళ నుంచి ఉన్నవి లాక్కుంటున్నారు అన్నారు.
కోడి గుడ్లు సరఫరా చేసేందుకు 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలట …కేసీఆర్ హాయం లో ఈ నిబంధనలు లేవు …జానారెడ్డి బంధువులో రేవంత్ బంధువులకో కాంట్రాక్టులు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు ..టెండర్ ఆప్లికేషన్ కు ఐదు వేల నుంచి 25 వేల రూపాయలు వసూల్ చేస్తున్నారు …కోడి గుడ్డు రేటు గతం లో మార్కెట్ రేటు కన్నా 30 పైసలు ఎక్కువ ఉండేది ..ఇపుడు కోడి గుడ్డు ధర ఏడు రూపాయలుగా నిర్ణయించారు ..కాంట్రాక్టర్ల నుంచి బ్యూరోక్రాట్లు ,కాంగ్రెస్ నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారు ..ఘోరమైన నేరాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నాయి …కేసీఆర్ పది సంవత్సరాల్లో పేద వాళ్ళ గురించి ఆలోచించారు..గురుకులాల్లో రేవంత్ పాలనలో ఇప్పటి వరకు 103 మంది విద్యార్థులు చనిపోయారు ..ఈ విద్యార్థుల మరణాల గురించి పట్టించుకునే శ్రద్ధ సీఎం రేవంత్ కు లేదు..కాంగ్రెస్ నేతలను మరింత ధనవంతులుగా మార్చేందుకు జీవో 17 తెచ్చారు ..టెండర్లకు ఈ నెల 14 దాకా గడువు విధించారు ..టెండర్ నిబంధనలు ఇంగ్లీష్ లో రాసి ఆన్ లైన్ లో పెట్టారు ..చిరు వ్యాపారులకు అవి అర్థం కావు …ఈ జీవో 17 ను రద్దు చేయాల్సిందే ..జీవో 17 రద్దుకు బీ ఆర్ ఎస్ ఉద్యమిస్తోంది …జీవో 17 రద్దు కోసం కోర్టుకు కూడా వెళతాం …గురుకులాల్లో వ్యవస్థలను ద్వంసం చేసే కుట్ర జరుగుతోంది …కలెక్టర్లు ,అదనపు కలెక్టర్ల కమీషన్ల పై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి
..త్వరలోనే సీ ఎస్ ను కలిసి మా దగ్గరున్న ఆధారాలు సమర్పిస్తాం అన్నారు.
Also Read:కూలీ..అదిరే వసూళ్లు!

