జూబ్లీహిల్స్ నియోజకవర్గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపు వ్యాఖ్యలపై స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నవీన్ యాదవ్ గల్లీ కూడా దాటనియ్యను అంటున్నాడు.. జూబ్లీహిల్స్ నీ అయ్యా జాగీరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకెంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ప్రజలు ఆలోచించాలి అన్నారు. కేసీఆర్ అందరికి తిండి పెడితే.. వీళ్లు అందరి ఇంట్లో గంజాయి పెట్టి కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా నవంబర్ 11వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు వేచి చూస్తున్నారు అన్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్. జూబ్లీహిల్స్ నా అడ్డా!.. ఎక్కడినుండో వచ్చిన మీరు గల్లీ దాటి బైటికిపోలేరు… మీ శవాలు కూడా ఇంటికి పోకుండా చేస్తానని హెచ్చరించారు.
Also Read:రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

