- Advertisement -
సిర్పూరు టి మండల కేంద్రంలో శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు బిఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్‌ఎస్పీ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందన్నారు.
సాంకేతిక లోపాల పేరిట సిసిఐ పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు దళారులకు పత్తి అమ్ముకొని నష్టపోతున్నారు అన్నారు. జిన్నింగ్ మిల్లుల ముందు రైతులు 15 రోజులుగా పడిగాపులు కాస్తున్న సిసిఐ అధికారులు కొనుగోళ్లు చేపట్టడం లేదు అని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నారు.
మార్చి 15 లోగా సిసిఐ అధికారులు పత్తి కొనుగోళ్లు పూర్తి చేయాలి, లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అన్నారు ప్రవీణ్ కుమార్.
Also Read:రేపటితో మహా కుంభమేళా ముగింపు
- Advertisement -

