మొద్దు నిద్రలో రేవంత్ సర్కార్:ఆర్‌ఎస్ ప్రవీణ్‌

13
- Advertisement -

ఎస్సీ సంక్షేమ గురుకులా ల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిశారు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అదోపాతాలానికి వెళ్తున్నాయి…అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు.

విద్యార్థులు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు కడుక్కుంటే తప్పు ఏంటి అని ఐఏఎస్ అధికారి అంటున్నారు… రేవంత్ రెడ్డి ఇంట్లో టాయిలెట్ రేవంత్ రెడ్డి కడుగుతున్నారా చెప్పాలన్నారు. మీ మంత్రులు ఇంట్లో వాళ్ళ టాయిలెట్స్ మంత్రులే కడుగుతున్నారా…?… మీ పిల్లల స్కూల్లో టాయిలెట్స్ మీ పిల్లలు కడుగుతున్నారా చెప్పాలన్నారు.

ఎస్సి వర్గాల పట్ల ఐఏఎస్ అలుగు వర్షిని వివక్ష చూపుతున్నారు… అందరికంటే పెద్ద మాదిగ,పెద్ద మాల నేనే అని రేవంత్ రెడ్డి అంటారు కానీ పేద పిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎట్లా చెప్పిస్తారు అన్నారు. దళిత వర్గాలు గత కొన్ని వందల సంవత్సరాలుగా టాయిలెట్స్ కడుగుతున్నారు… ఎవరి టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జీవో ఇవ్వు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

ఎస్సిలు ఇంజనీర్లు,డాక్టర్లు కావాలని కేసీఆర్ గురుకులాలు పెట్టారు… ఎస్సి గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నారు, తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడలేని వాళ్ళను సాంఘీక సంక్షేమ శాఖలో పెట్టారు… గురుకుల విద్యార్థిని ఆగసార నందినికి గోల్డ్ మెడల్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు నగదు ప్రోత్సాహం ఇవ్వరు, గౌలి దొడ్డిలో వున్న గురుకుల పాఠశాల సిబ్బందిని తొలగిస్తున్నారు… మేము గురుకుల బాట చేపడితే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు..ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని చెప్తున్న రాజ్యాంగం చెప్పాలన్నారు.

సంపన్న వర్గాల పిల్లలకు ఒక రూల్ పేద పిల్లలకు ఒక రూల్… మా రొట్టెలు మేమే చేసుకుని తినాలా…?, మేము పన్నులు
ఎందుకు కట్టాలి… రేవంత్ రెడ్డికి సీఎంగా వచ్చే 4 లక్షల జీతం మా పన్నులతో కాదా…?, ఎస్సిలకు బాయ్స్,గర్ల్స్ కు
ఒకే చోట తరగతులు ఉండకూడదని ప్రభుత్వం అంటోంది….అమ్మాయిలకు భువనగిరిలో సైనిక స్కూల్ పెడితే దాన్ని మూసివేశారు…ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు కేసీఆర్ పెట్టారు…ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదు…గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా రేవంత్ రెడ్డి,అలుగు వర్షిని కుట్ర చేస్తున్నారు అన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క,దామోదర రాజనర్సింహ, ఎస్సి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదు…దళిత మంత్రులు,ఎమ్మెల్యేలు బానిస బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు అన్నారు. పేద ప్రజలపై బాధ్యత లేని అధికారులను వెంటనే తొలగించండి…అలుగు వర్షిని లాంటి అధికారులను మీ సీఎంఓ ఆఫీసులో పెట్టుకోండి అన్నారు. గురుకులాలు రాష్ట్రంలో ప్రమాదంలో ఉన్నాయి… గురుకులాలను కాపాడుకోవాల్సిన
అవసరం రాష్ట్రంలో ఉంది అన్నారు. టాయిలెట్లు విద్యార్థులు కడగాలని ఆదేశాలు ఇచ్చిన అలుగు వర్షినిపై చర్యలు తీసుకోవాలి…
అలుగు వర్షినిని వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.

- Advertisement -