పోలీసులే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది:ఆర్‌ఎస్పీ

1
- Advertisement -

తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి వరకు ఎంతో మంది మాటలు ,అంచనాలను పటాపంచలు చేస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు అన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ…శాంతిభద్రతల విషయంలో కేసీఆర్ మొదటి నిర్ణయం లోనే 700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు అన్నారు. దేశంలోనే శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది…నిన్న డిజిపి గారు వార్షిక మీడియా సమావేశంలో డిజిపి అన్ని అంశాలు చెప్పారు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రానికి హోమ్ మంత్రి లేడు…ఇద్దరు డిజిపిలు మారారు.అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు అన్నారు. పోలీస్ నియామకాలు దాదాపు ఎస్సైలు,కానిస్టేబుల్ 40 వేల నియామకాలు చేపట్టారు…ఒక్క సంవత్సరం లోనే శాంతిభద్రతల ఇంత దారుణంగా క్షించాయి.
నిన్న డీజీపీ కొన్ని లెక్కలు మాత్రమే మీడియా ముందు పెట్టారు అన్నారు. జగిత్యాల లో పెట్రోల్ బంక్ లో పోలీస్ లపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేస్తే కూడా కేస్ పెట్టలేని పరిస్థితి…మీడియా లో సోషల్ మీడియాలో పొలిస్ లపై వార్తలు రావడంతో అప్పుడు జగిత్యాల ఎస్పీ కేస్ నమోదు చేశారు అన్నారు.

డబ్బుల కోసం హత్యలు 40 శాతం పెరిగాయి.అత్యాచారాలు పెరిగాయి..82 శాతం 18 సంవత్సరాల లోపు ఉన్న మహిళలపై అత్యాచారాలు పెరిగాయి అన్నారు. ఆనాడు కేసీఆర్ షి టీమ్స్ పెట్టారు మహిళల కోసం.ఎక్కడ పోయాడు ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి…రాజ్యాంగం ను రక్షిస్తాను అంటాడు రాహుల్ గాంధీ మరి ఎక్కడకు పోయారు అన్నారు.

గంజాయి స్మగ్లింగ్ పెరిగింది. ఎక్కడ పోయారు…తెలంగాణ పోలీస్ అంటే రాజకీయ కక్ష్యలకు వేదిక అయింది.. సైబర్ క్రైమ్ కేస్ లు 50 శాతం పెరిగాయి.ఎక్కడ పోయారు సైబర్ క్రైమ్ పోలీసులు అని ప్రశ్నించారు హరీశ్. సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వాళ్ళ మీద మాత్రమే నిఘా పెట్టారు తప్ప బెట్టింగులు, లోన్ అప్స్,డిజిటల్ అరెస్టులపై దృష్టి పెట్టడం లేదు…గాంధీ భవన్ నుండి ఏ పిర్యాదు తీసుకోవాలని చెప్తే అదే పిర్యాదు మీద బీఆర్ఎస్ నాయకులపై కేస్ లు పెడుతున్నారు పోలీసులు అన్నార.

Also Read:గోదారి గట్టు …ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే కేస్ లు పెట్టి వేధిస్తున్నారు.గాంధీ భవన్ నుండి పిర్యాదు రాగానే కేస్ పెట్టాలి పోలీసు స్టేషన్ తీసుకువెళ్లాలి.ఈ కేస్ లు ఎవ్వి కూడా తెలంగాణ ప్రజలకు చెప్పలేదు కాబట్టే మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నా…ఎందుకు ఇంత కక్ష్య తో వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి,లగచర్ల లో తిరుపతి రెడ్డి నేతృత్వంలో కరెంట్ బంద్ చేసి ఇంటర్నెట్ తీసేసి గిరిజన మహిళల ను వేదించారు.వాళ్ళు స్వయంగా నేషనల్ హుమెన్ రైట్స్ ముందు చెప్పారు అన్నారు.

పోలీసులు ఇవాళ ధర్నా చేస్తున్న పరిస్థితి వచ్చింది.డీఏ లు లేవు.ఏక్ పోలీసింగ్ ఎటు పోయింది.స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఇవాళ ఏమైంది..పోలీసుల ఆత్మహత్యలు పెరిగాయి వాటిపై మాట్లాడడం లేదు అన్నారు.కొండారెడ్డి పల్లిలో సాయి రెడ్డి అనే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు దానిపై మాట్లాడలేదు డీజీపీ…కొండారెడ్డి పల్లిలో రుణమాఫీ గురించి కవరేజ్ కు వెళ్తే మహిళ జర్నలిస్టులపై దాడి చేశారు దానిపై మాట్లాడడం లేదు. తిరిగి జర్నలిస్టులపైననే కేస్ పెట్టారు అన్నారు.

- Advertisement -