పోలీస్ ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

0
- Advertisement -

వరుసగా పోలీసు ఆత్మహత్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ ఆత్మహత్యలపై పోలీసు ఉన్నతాధికారులకు కీలక సూచన చేశారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.

1. పోలీసు ట్రైనింగ్ లో ఏదో తీవ్రమైన లోపం ఉంది. అవుట్ డోర్ ను కొంత కఠినతరం చేయండి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండేట్లు తయారు చేయండి. కొంతమందికి మందికి సెల్యూట్ కూడా సరిగా రావడం లేదు.
2. పోలీసు కుటుంబాలకు కు ఉచిత కౌన్సిలర్ సౌకర్యం కల్పించండి. సఖీ సెంటర్లు మన కుటుంబాలకు కూడా అవసరం.
3. తరచుగా పండుగల- బందోబస్తు ల తరువాత పోలీసు కుటుంబాలతో బఢాఖానా(గెట్ టుగెదర్)లు నిర్వహించండి. మీరు కుటుంబంతో అటెండ్ కాకుండా వాటిని నామ్ కే వాస్తే గా పెడ్తే కింది ఆఫీసర్లు కేవలం షామియానా బిల్లులు పట్టుకొస్తరు. వాటిని మరో పరేడ్ లాగా మారుస్తారు.
4. చిన్న చిన్న తప్పులకు ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్ లతో ఇబ్బంది పెట్టకండి. దయచేసి కౌన్సిలింగ్ ఇవ్వండి.
5. బెట్టింగ్,లోన్లు, మద్యం, అక్రమ చాటింగ్ కు బానిసలైన ఉద్యోగుల కోసం జిల్లాలో/బెటాలియన్లలో ‘డీ అడిక్షన్ సెంటర్లను’ ఓపెన్ చేయండి.
6. బహుశా ఆదర్శంగా బతుకుతున్న కుటుంబాలకు గుడ్ సర్వీసు ఎంట్రీ, కమెండేషన్ లెటర్, బెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద వీక్, మెడల్స్ ఇవ్వవచ్చేమో ఆలోచించండి.
7. ప్రతి పోలీస్ స్టేషన్ లో క్రీడలకు వెసులుబాటు కల్పించండి. ఇది చాలా ముఖ్యం.
8. ఆరోగ్య భద్రత బిల్స్ రెగ్యులర్ గా వచ్చేట్లు చూడండి.
9. సరెండర్ లీవులు టీఏలు రెగ్యులర్ గా చెల్లించండి.
10. పోలీసు ఫైనాన్స్ కార్పోరేషన్ లేదా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చెస్తే ఈజీ లోన్ల బారిన పడరు. ఆలోచించండి.

- Advertisement -