కాంగ్రెస్ పార్టీ అంటేనే చీటింగ్ అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఎక్స్‌లో కేటీఆర్ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆర్‌ఎస్పీ..బాగా చెప్పారు కేటీఆర్ గారూ.. కాంగ్రెస్ అంటేనే చీటింగ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పునాదులే మోసం మీద నిర్మించబడ్డాయని ఆర్ఎస్పీ విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో పాటు మైనార్టీలకు అనేక మోసపూరిత హామీలిచ్చింది. ఈ వర్గాలను ప్రయోజకులుగా తీర్చిదిద్దలేదు. ప్రతి స్కామ్‌లో కాంగ్రెస్ హస్తం ఉంటుందన్నారు. అమృత్ గేట్ నుంచి కోల్ గేట్ వరకు అన్ని కుంభకోణాలే. ఈ స్కామ్‌లకు పాల్పడింది అగ్రవర్ణ ధనికులే అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేటి బీజేపీని సృష్టించడం వెనుకాల కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
You have nailed it, @KTRBRS garu.
The very foundations of Congress are built on cheating.They’ve ruled this country for half a century and still poor are dependent on the government for their everyday survival.
They cheated Hindus, Muslims, and Christians.
They cheated SCs,… https://t.co/bmLzrD1K61— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 4, 2025
Also Read:TTD: సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం