ఎంపీ బండ ప్రకాష్ రాజీనామా ఆమోదం..

201
- Advertisement -

టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించారు. ఆ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం తెలంగాణ రాజ్యసభ సభ్యులతో కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుని కలిసిన ప్రకాష్.. తన రాజీనామా లేఖను అందచేశారు. ఆయన రాజీనామాను ఈరోజు రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కాగా ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండ ప్రకాష్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్సీగా ఎన్నికైనందున రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఈ నెల 6న ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -