- Advertisement -
రూ.500 నోట్లను కూడా రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై కేంద్ర సమాచార శాఖకు చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారికంగా స్పందించింది. ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉన్నాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అసత్యం.. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేసింది.
ఇప్పటికే ప్రజల్లో భయం మొదలవుతున్న వేళ పీఐబీ స్పష్టత ఇవ్వడంతో అసత్య ప్రచానికి తెరపడింది. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా చట్టబద్ధంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లను నమ్మకంగా వినియోగించొచ్చని స్పష్టమైంది.
Also Read:మంత్రివర్గ విస్తరణ..ముగ్గురికి చోటు!
- Advertisement -

