- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం కోసం మరో రూ.500 కోట్లను విడుదల చేసింది. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని అమలుచేస్తుండగా ఇప్పటికే రూ. 500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రూ. 500 కోట్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.
- Advertisement -