కొండగట్టు అభివృద్ధికి రూ. 500 కోట్లు

43
- Advertisement -

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పునర్నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయత, అభయారణ్యంతో కూడిన కొండగట్టు ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్ది, దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా కార్యాచరణ రూపొందిచేలా బుధవారం నాడు కొండగట్టు అంజన్న సన్నిదిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు.

దేవాలయాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా విస్తరించడానికి సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాల పై లొకేషన్ మ్యాపుతో పూర్తిగా పరిశీలించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న స్థల పురాణం గురించి సీఎం కేసీఆరే స్వయంగా అధికారులకు వివరించారు.వైష్ణవ సాంప్రదాయాన్ని అనసరించి ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధిని చేపట్టనున్నట్లు స్పష్టం చేసిన సీఎం. నిధులకు ఎలాంటి కొరత లేదనీ, 1000 కోట్ల రూపాయలైన కేటాయించేందుకు సిద్ధమని చెప్పారు.

యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం సమయంలో చేపట్టిన సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాల మాదిరి అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను కూడా చేపతడతామని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గర్భాలయం మినహా ఆలయాన్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు.ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మూలవిరాట్టును ముట్టుకోకుండా ఆలయ విస్తరణ సాగాలన్నారు. వాస్తు నియమాల ప్రకారం ఏ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలో నిర్ణయించుకోవాలన్నారు.

ఏటా లక్షలాది మంది దీక్షాపరులు దీక్ష చేపడతారని, వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతులను ఏర్పాటు చేయాలని తెలిపిన సీఎం…మంగళవారం, శని, ఆదివారాల్లో రద్దీ సమయాలతో పాటు, హనుమాన్ జయంతి, ఇతర పండుగల సందర్భాల్లో భక్తుల తాకిడీని తట్టుకునేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వస్తున్న భక్తులతో పాటు, ఆలయ అభివృద్ధి తర్వాత పెరగనున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు అందించేలా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.క్యూ లైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు.

హనుమాన్ జయంతికి సగం భారతదేశం కొండగట్టు అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలని…కాళేశ్వరం నీటిని పైపుల ద్వారా కొండడట్టుకు తరలించి భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా నీటి వసతిని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖాన, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి శిల్పులను సమకూర్చాలని ఆనంద్ సాయికి సూచించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడు సంవత్సరాల కాలం పడుతుందనీ, అప్పటిదాకా ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి బాలాలయాన్ని నిర్మించాలని అధికారులకు తెలిపారు. గుట్టల పై నుంచి సహజంగా ప్రవహించే నీటి ప్రవాహం సంతులోని లొద్దిలో నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి సీఎం చర్చించారు.

గుట్ట చుట్టూ ఉన్న చెరువుల గురించి ఇరిగేషన్ అధికారులతో సీఎం ఆరా తీశారు.మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొండగట్టులో నీటి బాధ తప్పిందని సీఎంకు వివరించారు అధికారులు. గుట్ట మీద కాటేజీల నిర్మాణికి దాతలను ఆహ్వానించాలన్న సీఎం. ఇప్పటికే శ్వేత గ్రానైట్స్ వారు నిర్మించి కాటేజ్ విస్తరణలో పోతున్నందున దాన్ని తిరిగి నిర్మాస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అందుకు సీఎం గంగుల కమలాకర్ ను అభినందించారు. కళ్యాణ కట్ట దగ్గర పుష్కరిణిలు ఏర్పాటు చేయాలన్నారు. కళ్యాణ కట్ట పుష్కరిణి పక్కపక్కన ఉండటంతో పాటు స్త్రీలు, పురుషులకు ప్రత్యేక పుష్కరిణులు ఏర్పాటు చేయాలన్నారు.

కొండగట్టు అంజన్న అబయారణ్యం ప్రాంతం మైసూరు – ఊటి రహదారిలోని నీలగిరి కొండల్లోని బందీపూర్ అభయారణ్యం మాదిరి మార్చాలని అటవీశాఖ అధికారి భూపాల్ రెడ్డికి సీఎం సూచించారు. స్థల పురాణం పుస్తకాలను ముద్రించాలని, రాస్ట్రంలోని అన్ని ఆలయాల స్థల పురాణ పుస్తకాలు ఉండేలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖ ఎండి మనోహర్ రావును సీఎం ఆదేశించారు. ఆలయానికి వచ్చిన భక్తుల దర్శన విధానాన్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. అదే పద్ధతిలో పునర్నిర్మాణాలను చేపట్టాలన్నారు.మొదటి మూలవిరాట్టును దర్శించుకన్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వేంకటేశ్వర స్వామిని, తర్వాత గుట్ట కింద భేతాళ స్వామి దర్శనం, రాములవారి పాదుకల దర్శనం సర్క్యూట్ ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

గుట్ట మీదకి వచ్చే వివిఐపి లకోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్ సూట్ , వివిఐపి సూట్ల నిర్మణానాకి సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తుల నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలన్నారు.రెండు నెలల్లో కొండగట్టు అంజన్న ఆలయానికి నీటి సప్లై జరిగేలా మిషన్ భగీరథ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని తరలించే పనులను తక్షణమే పనులు చేపట్టాలని సీఎం స్మితా సభర్వాల్ సూచించారు. ఈ నీటితోనే నిర్మాణ పనులు మొదలైతాయన్నారు. అంజనాద్రి పేరుతో వేదపాఠశాలను నిర్మించాలనీ, అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆలయ పున్నర్మిర్మాణం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విభాగాల అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను అనేక పర్యటనలు చేపట్టాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -