కర్నూలు బస్సు ప్రమాదం మృతులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
మృతి చెందిన వారిలో తెలంగాణ పౌరులు ఉంటేనే ఈ పరిహారం వర్తిస్తుంది పేర్కొంది ప్రభుత్వం. కర్నూల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు. బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు ఆదేశించాం… ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలిఫోన్ లో మాట్లాడాం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం… త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లు సమావేశమవుతాం అన్నారు.
Also Read:వెంకీ రాకతో మరింత జోష్!

