మోడీ హెచ్చరిక..

196
modi
- Advertisement -

ప్రధాని మోడీ పెద్ద నోట్లరద్దుతో,,పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులకు బారులు తీరారు. తమ దగ్గర దాచుకున్న డబ్బును సైతం బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేస్తున్నారు. అయితే పెద్దనోట్లను రద్దు చేసిన నాటినుంచి ఇప్పటి వరకు పాత నోట్లు..ఎంత డబ్బు జమ అయ్యిందో మోడీ వెల్లడించాడు. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో మొత్తం 12 రోజుల్లో ఇప్పటివరకూ 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

modi

నల్లధనాన్ని అరికట్టేందుకే తాను పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటోన్న నల్లకుబేరుల నుంచి రక్షించడానికే తాను నోట్ల రద్దు చేపట్టానన్నారు. నోట్ల రద్దుతో పది రోజుల్లోనే పాత పన్నులన్నింటినీ జనం కట్టేశారని చెప్పారు. పది రోజుల్లో మున్సిపాలిటీలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పారు. పాతనోట్ల జమతో పాటు.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఓ హెచ్చరిక కూడా చేశాడు.

modi

నోట్ల రద్దు దెబ్బతో నల్లకుబేరులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ప్రధాని మోదీ చెప్పారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లోకి తరలించేందుకు నల్లకుబేరులు పేద, మధ్యతరగతి ప్రజలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తమ వద్ద ఉన్న పాత 500, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను పేద ప్రజల అకౌంట్లలోకి మారుస్తున్నారని ప్రధాని వెల్లడించారు. హీన పక్షంగా రెండున్నర లక్షల రూపాయలను జన్‌ధన్ అకౌంట్లలోకి మారుస్తూ ఆరు నెలల తర్వాత 50 వేల రూపాయలు ఇస్తామంటూ నల్లకుబేరులు చెబుతున్నారని తెలిపారు.

నల్లకుబేరుల పన్నాగాలకు బలికావద్దని, అమాయకంగా వారి వలలో చిక్కుకోవద్దని ప్రధాని పేద, మధ్యతరగతి ప్రజలకు సలహా ఇచ్చారు. అకౌంట్లలో డబ్బులు వేసుకోవాలని సూచించే నల్లకుబేరులతో జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. నల్లకుబేరులను దగ్గరకు నీయవద్దన్నారు.

- Advertisement -