రూ.5కే బ్రేక్ ఫాస్ట్.. ఎప్పటినుండి అంటే!

6
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బోజన పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీం పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చి రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 139 చోట్ల రూ.5కే భోజనం పెడుతుండగా. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే టిఫిన్ ను అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు.

తొలి దశలో 60 క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ ను అందుబాటులోకి తేనుంది జీహెచ్ఎంసీ. ఆ తరువాత దశల వారీగా 150 సెంటర్లకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బ్రేక్ ఫాస్ట్ లో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు ఇండ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి పౌష్టికాహారం అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూ సిద్ధం చేసింది. క్యాంటీన్లలో పరిశుభ్రంగా ఉండేలా, నాణ్యత ప్రమాణాలు పాటించేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

Also Read:KPHB ఎకరం భూమి @రూ.65.34 కోట్లు

- Advertisement -