Chiru:ఫ్యాన్సీ నెంబర్‌కే అంత రేటా

87
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు చేరింది. ఇటీవలె టయోటా వెల్‌ఫైర్‌ కారును కొనుగోలు చేశారు చిరంజీవి. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కి వచ్చారు చిరు. కేవలం ఫ్యాన్సీ నెంబర్‌కే రూ.4.70 లక్షలు వెచ్చించారు. TS09 GB 1111 నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఫోటో దిగి, డిజిటల్ సైన్ చేశారు. చిరు రాకతో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ సందడిగా మారింది.

చిరు గ్యారేజ్‌లో ఇప్పటికే అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా కొన్న కారు ధర కోటి 30 లక్షల రూపాయలు. అన్నీ ఫీచర్స్, ఇంటీరియర్ కలుపుకుంటే మరో 20 పెరిగితే మొత్తం ధర కోటిన్నర. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసమే ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -