కళ్యాణలక్ష్మీ కోసం రూ.350 కోట్లు..

646
kalyanalaxmi
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మీ పథకం కోసం రూ. 350 కోట్లు విడుదల చేసింది. ఇందుకు అవసరమైన పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

పేదింటి ఆడపిల్లల పెళ్లి భారం కాకుడదని సీఎం కేసీఆర్‌ కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ స్కీం తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేస్తుంది సర్కార్. దివ్యాంగులకు రూ.1,25,145 అందజేస్తున్నారు.

సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ స్కీం ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపింది. తొలుత ఈ పథకం ద్వారా రూ.51వేలు అందించారు. తర్వాత ఈ సాయాన్ని రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచుతు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -