ఆర్టీసీకి అదనంగా రూ.250 కోట్లు?

31
- Advertisement -

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసిన ఆర్టీసీ డిపోలలో మహిళలే దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలవుతున్న ఈ ఉచిత ప్రయాణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతుందని విశ్లేషకులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయినప్పటికి హామీ ఇచ్చినందున ప్రస్తుతం అమలు చేయాల్సిన పరిస్థితి. అయితే మొదట అన్నీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అని చెప్పినప్పటికి అమల్లోకి వచ్చే సరికి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికి ఆర్టీసీ పై అదనపు భారం బారిగానే పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ పై ప్రతి నెల రూ. 250 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఇటీవల అధికారులు చెప్పుకొచ్చారు. .

దీంతో ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తూ ఆర్టీసీకి ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. దీంతో ఆర్టీసీకి సాధారణ చెల్లింపులతో పాటు ప్రతి నెల అదనంగా రూ.250 కోట్లు కేటాయించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోందట. అయితే ఈ రకమైన చెల్లింపులు ఎంతవరకు చెల్లిస్తుందనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి హామీ కూడా వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎలా సమకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. మరి పథకాల అమలుకు ప్రతి ఏటా రూ.80 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందని నిపుణులు చెబుతున్నా వేల ఆ స్థాయి బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమీకృతం చేస్తుందో చూడాలి.

Also Read:వింటర్ లో నిమ్మరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -