అవినీతిపై పోరాడేందుకు భారతప్రభుత్వం రూ.500,1000నోట్లను రద్దు చేసింది. నవంబర్ 8వ తేదిన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ ప్రకటనలో రూ.500,1000నోట్లను చెల్లనివిగా ప్రకటించి కొత్త రూ.500,2000లను చెలామణిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యనికి గురిచేశారు.
అయితే త్వరలోనే రూ.2వేల నోటును ప్రభుత్వం రద్దు చేయనుందని,.. రద్దు చేసిన తర్వాత చిన్న డినానిమినేషన్ నోట్లను ప్రవేశపెడుతుందని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ఎస్ఎస్ నేత గురుమూర్తి తెలిపారు. రానున్న ఐదేళ్లలో రూ.2వేల నోటును ప్రభుత్వం పక్కాగా రద్దు చేస్తుందని గురుమూర్తి అన్నారు. రూ.2వేల నోటును ప్రభుత్వం తాత్కాలికంగా ప్రవేశపెట్టిందని చెప్పిన ఆయన….హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడే ఇబ్బందులను రూ.2వేల నోటుతో పూడ్చాలనే ఉద్దేశంతోనే కేంద్రం రూ.2వేల నోటును విడుదల చేసిందని చెప్పుకొచ్చారు.
చిన్న నోట్లనే చలామణిలో ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు గురుమూర్తి వెల్లడించారు. అధిక డినామినేషన్‌గా రూ.500నోటునే చలామణిలో ఉంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆతరువాత రూ.250,100నోట్లను ఎక్కువగా విడుదల చేస్తుందని గురుమూర్తి వివరించారు. ముఖ్యమైన విషయం ఏమింటటే పెద్దనోట్ల రద్దు తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం గురుమూర్తి దగ్గర నుంచి కొన్ని సలహాలు,సూచనలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉన్నట్లు ఉండి రూ.2000వేల నోటు రద్దు చేస్తే మళ్లీ ప్రజలకు కొత్త సమస్యలు వచ్చినట్లే అనే ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉన్న పాత నోట్లను మార్చకోడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రూ.2000నోటును రద్దు చేసే ముందు దానికి తగినంత నగదు బ్యాంక్‌లో ఉండేల ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఇలా అయితే ప్రజలకు కొత్త ఇబ్బందిని నుంచి బయటపడే అవకాశలు ఉంటాయిని ఆర్ధిక నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
సో మొత్తం మీద మళ్లీ రెండువెయ్యిల రూపాయిల నోటు రద్దు అయ్యే అవకాశలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని,…ఏ క్షణంలో నైన మళ్లీ మోడీ సంచలన నిర్ణయం తీసుకుని అవకాశం ఉందని… వీళైనంత వరకు నగదు బ్యాంక్‌లోనే ఉంచుకునే ప్రయత్నం చేసుకొవాలని నలధనం నిర్ములనకు అందరు కృషి చేయ్యాలని కొత్త మంది మేధావులు భావిస్తున్నారు.