తిరుమల శ్రీవారికి ప్రపంచ నలుమూలలకు చెందిన భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలకు కొదువేలేదు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు.తాజాగా ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి రూ. 2.40 కోట్ల భారీ విరాళాన్ని అందజేశాడు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ పాలక మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కలిసిన ఆ భక్తుడు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. భగవంతునికి విరాళం ఇచ్చినందున తన పేరు వెల్లడించడానికి ఇష్టంలేదని, బహిర్గతం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తాన్ని టీటీడీకి చెందిన వివిధ ట్రస్టుల కింద జమ చేయాలని దాత సూచించారు.
దీంతో పాటు టీటీడీకి భారీగా విరాళాలు అందుతున్నాయి. తిరుపతికి చెందిన సూరాలితి అనే బాలిక పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని అందించారు. ముంబయికి చెందిన మెకిన్సే కన్సల్టెంట్ ఈశ్వర్ ప్రశాంత్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.