- Advertisement -
తిరుమల వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సెన్సార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ, సీఈవో వెంకటేష్ కన్నపన్ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి శుక్రవారం అందజేశారు.
జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తురాలికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారాన్ని అందించారు. కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం, సర్వరాజుపేట కాలనీకి చెందిన బాధితురాలు జి. శైలజ గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షల డీడీని శుక్రవారం తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బాధితురాలికి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శాంతారాంతో కలిసి అందజేశారు.
Also Read:పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా
- Advertisement -