2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్ రావు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. ఇక అన్నివర్గాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా దళిత బంధు పథకం కోసం భారీగా నిధులు కేటాయించింది.
బడ్జెట్ కేటాయింపులు..
()దళిత బంధుకు రూ.17,700 కోట్లు
()మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
()మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ.1,500 కోట్లు
()మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు
()విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
()కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
()పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
()డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12వేల కోట్లు
()ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు
()పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు
()రుణమాఫీకి రూ.6,385 కోట్లు
()షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు
()ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
()ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
()యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు
()మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు
()మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
()గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు
()హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
()పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
()రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
()పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
()హోంశాఖకు రూ.9,599 కోట్లు
()మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
()రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
()రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
()వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
()వ్యవసాయ శాఖకు రూ.26,831
()గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
()నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
()కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
()ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
()విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
()ఆయిల్ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు
()ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
()బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు
ఇవి కూడా చదవండి..