1500 కోట్లతో ‘రామాయ‌ణ్‌’

399
ramayan
- Advertisement -

ద‌క్షిణాదిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మ‌రియు బాలీవుడ్ లో క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ముద్ర వేసుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోక‌స్ బ్యాన‌ర్ పై న‌మిత్ మ‌ల్హోత్ర సంయుక్తంగా 1500 కోట్ల కి పైగా చారిత్రాత్మ‌కంగా భార‌త‌దేశం లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం గా రామ‌య‌ణ్ ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు.

గ‌జిని వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించిన తెలుగు వాడు మ‌ధు మంతెన ఈ చిత్రం నిర్మాణ భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. దంగ‌ల్ లాంటి అత్యద్భుత మైన చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నితేష్ తివారి మ‌రియు మామ్ లాంటి సెన్సిటివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌వి ఉద్యావ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని మూడు భాష‌ల్లో మూడు భాగాలుగా నిర్మాణం చేప‌డుతున్నారు. ఓక్కో భాగాన్ని 500 కోట్ల‌కి పైగా బ‌డ్జెట్ తో నిర్మిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక పాన్ ఇండియా నుంచి ఎంచుకుంటారు. సౌత్ నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించ‌టం ఇదే ప్ర‌ధ‌మం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబ‌ర్ నుండి మెద‌ల‌వుతుంది.

క‌థ న‌చ్చితే గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బ‌డ్జెట్ కి ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాలు నిర్మిస్తార‌నేది గ‌తంలో చాలా చిత్రాలు ప్రూవ్ చేశాయి.. టాలీవుడ్ బడ్జెట్ 20 కోట్ల‌లో వున్న‌ప్పుడే మగ‌ధీర లాంటి అత్యంత భారీ చిత్రాన్ని 40 కోట్ల కి పైగా నిర్మించి తెలుగు సినిమా స్టామినా నిరూపించారు. అలాగే త‌మిళం లో విడుద‌ల‌య్యి విజ‌యాన్ని సాధించిన గ‌జిని చిత్రాన్ని ద‌క్షిణాది కే ప‌రిమితం కాకుండా హిందీ లో అమీర్‌ఖాన్ లాంటి సూప‌ర్‌స్టార్ తో నిర్మించి బాలీవుడ్ లో మెద‌టి 100 కోట్లు వ‌సూలు చేసిన చిత్రంగా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ రికార్డు క్రియేట్ చేసింది. గ‌జిని చిత్రాన్ని తెలుగు నిర్మాత‌లైన అల్లు అర‌వింద్‌, మ‌ధు మంతెన లు సంయుక్తంగా నిర్మించి బాలీవుడ్ లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించారు. ఇప్ప‌డు అల్లు అర‌వింద్ నిర్మాత గా నిర్మిస్తున్న భార‌త‌దేశ తొలి భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ రామ‌య‌ణ్ కి కూడా మధు మంతేన నిర్మాణ భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

సౌత్ నిర్మాణ సంస్థ‌ల్లో అగ్ర‌గామిగా పేరొందిన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ మ‌రియు బాలీవుడ్ లో ప్రైమ్ ఫోక‌స్ బ్యాన‌ర్ తో క‌లిసి సంయుక్తంగా నిర్మాణం చేబ‌డుతున్నారు. డ‌బ‌ల్ నెగెటివ్ వి ఎఫ్ ఎక్స్ కంపెని కి గ‌తంలో 4 గ్రాఫిక్ విభాగానికి ఆస్కార్ అవార్డ్ లు గెలుచుకుంది. ఈ కంపెని ప్రైమ్ ఫోక‌స్ లో ఒక భాగ‌మే.. ఇప్ప‌డు వి ఎఫ్ ఎక్స్ కి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌పంచ స్థాయి విలువలు క‌నిపించేలా ఈ రామ‌య‌ణ్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ మ‌రియు న‌మిత్ మ‌ల్హోత్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పురాణ గ్రంథం అయిన రామాయ‌ణం గురించి తెలియ‌ని వారుండ‌రు.. అది తెర‌రూపం దాల్చ‌డ‌మంటే అది కూడా పూర్తి రామాయాణాన్ని మూడు భాగాల్లో వ‌ర్ణించాలంటే దానికి త‌గ్గ ఉద్దండులు కావాలి.. ఈ అపూరూప కావ్యాన్ని తెర‌కెక్కించే పూర్తి భాద్య‌త‌ని నితీష్ తివారి, ర‌వి ఉద్యావ‌ర్ లు తీసుకున్నారు. ఈమ‌ద్య కాలంలో ప్రేక్ష‌కుల మ‌న‌సులు విప‌రీతం గా భాష‌, ప్రాంతం అనే సంబంధం లేకుండా ఆలోచింప‌జేసిన చిత్రాలు దంగ‌ల్‌, మామ్‌. ఈరెండు చిత్రాలు కూడా క‌మ‌ర్షియ‌ల్ గా ఎంత గొప్ప విజ‌యాలు సాధించినా కూడా అంతే రేంజి లో మ‌న‌సుల్ని క‌ట్టిపాడేశాయి. రామాయ‌ణం లో ఓ తండ్రి మాట‌. త‌ల్లి మ‌మ‌కారం, అన్న‌ద‌మ్ముల అనుబంధం, భార్య‌బ‌ర్త‌ల ప్రేమ‌లు.. రాజ్యాధికారం.. రాక్ష‌స‌యుధ్ధాలు.. భ‌క్తుడి విశ్వాసం. భ‌గ‌వంతుడి ప‌రాక్ర‌మం లాంటి ఎన్నో ఘ‌ట్టాలు తెర‌కెక్కనున్నాయి.. ఇలాంటి చరిత్రాత్మ‌క చిత్రాన్ని మూడు భాష‌ల్లో మూడు భాగాలుగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాన్ని నితీష్ తివారి, ర‌వి ఉద్యావ‌ర్ లు పొందారు.

- Advertisement -