Salaar:హీరోకి దర్శకుడికి చెరో 100 కోట్లు

37
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా స‌లార్. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. కాగా ఈ సినిమాకు ప్ర‌భాస్ 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు రాగా, తాజాగా ప్రశాంత్ నీల్ కూడా స‌లార్ కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓ సినిమా కోసం ఇలా హీరో – దర్శకుడు ఇద్దరూ చెరో 100 కోట్లు తీసుకోవడం నిజంగా విశేషమే. ఐతే, ఈ రెమ్యునరేషన్ ‘సలార్ 2’ కి కూడా కలిపా ?, లేక.. కేవలం పార్ట్ 1 కోసమే ఇద్దరూ చెరో వంద కోట్లు తీసుకున్నారా ? అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి, స‌లార్ హిట్ అవ‌డంతో ‘స‌లార్ 2’ పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ‘సలార్ పార్ట్ 1’ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.503 కోట్లు (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.178 కోట్ల గ్రాస్ సాధించిన సలార్.. రెండో రోజు రూ.117 కోట్లు రాబట్టింది. ఇక, ఆదివారం రూ.107 కోట్లు వసూలు చేసింది. అలాగే, సోమవారం నాడు రూ.101 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.

మరి ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాదిస్తుంటే.. ఇక ప్రభాస్ – ప్రశాంత్ నీల్ చెరో వంద కోట్లు తీసుకోవడంలో తప్పేం ఉంది. అన్నట్టు తన సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఓ హాలివుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”సలార్ కథ నాకెంతో నచ్చింది. విన్న వెంటనే అంగీకరించాను. సలార్ తొలి పార్ట్‌తో పోలిస్తే రెండోది మరింత అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించుకుంటుంది” అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

Also Read:తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తమిళి సై?

- Advertisement -