సిద్ధిపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. ఎందుకనేగా మీ సందేహం 10 రూపాయలకే చీర అని ఆఫర్ ప్రకటించడంతో మహిళలు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఘటన సిద్ధిపేటలోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో జరిగింది.. సిద్ధిపేట చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకులకు కష్టంగా మారింది. తక్కువ ధరలో లభ్యమయ్యే చీరలను సోంతం చేసుకోవడానికి మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది.
అయితే మాల్ వద్ద పరిస్థితి వృదుతంగా మారింది. అక్కడ చాలామంది మహిళలు కిందపడిపోగా, వారిని తొక్కుకుంటూ మిగతావారు ముందుకెళ్లిపోయారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో మాల్ సిబ్బంది వీరిని ఆసుపత్రికి తరలించారు. కాగా, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా దొంగలు సైతం తమ చేతివాటం చూపారు. చీరలకు ఆశపడి వచ్చిన కస్టమర్ల నగలు, మొబైల్ ఫోన్లు,పర్సులు దొంగలించేశారు. దీంతో పలువురు బాధితులు కన్నీరు మున్నీరైయ్యారు.