సాయిచంద్‌ కుటుంబానికి రూ.కోటి సాయం అందజేత

53
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాలు మేరకు దివంగత సాయిచంద్ భార్య రజినికి బిఆర్ఎస్ పార్టీ తరుపున ఒక కోటి రూపాయల చెక్ ను అందించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ ,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కోటి రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా సాయిచంద్ నిలిచారని అన్నారు.సాయిచంద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం కోటి యాభై లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు రజిని గారికి,మరో 50 లక్షలు సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి అందిస్తున్నట్లు తెలిపారు.భర్తను కోల్పోయిన రజిని బాధ తనకు తెలుసని,ఈ సందర్భంగా ఆమెను మంత్రి ఓదార్చారు.సాయిచంద్ మరణం అత్యంత బాధాకరమని, చనిపోయినప్పటి నుండి కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మొదటి పాట సాయిచంద్ పాడితే, ఆ తర్వాతి మాట కేసీఆర్ గారిది ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో పార్టీ తరుపున కోటిన్నర సహాయం అందిస్తున్నట్లు తెలిపారు, గుర్రంగూడ లో సాయిచంద్ భార్య రజిని గారికి,మహబూబ్ నగర్ లో తల్లిదండ్రులు, సోదరికి అందించినట్లు తెలిపారు. సాయిచంద్ మరణం తీరని లోటని అన్నారు..ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ… ఉద్యమ కాలంలో సాయిచంద్ లేని సభ లేదన్నారు.ఎక్కడ ఉన్న పాట చిరస్థాయిగా నిలిసిపోతుందన్నారు.

దివంగత సాయిచంద్ సతీమణి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజిని మాట్లాడుతూ… నేను ఒక కళ ను అని ఆ కళ విశ్వ వ్యాప్తం కావటానికి ఒక శక్తి లాగా కేసీఆర్ గారు నిలిచారని సాయిచంద్ తరుచూ తనతో చెబుతుండేవారని అన్నారు.మా కుటుంబానికి పూర్తి అండగా ఉన్న కేసీఆర్ బాపు గారికి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

Also Read:హ్యాపీ ఓనం..

- Advertisement -