దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ చిత్రం విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి.ఈమేరకు పెంచిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో పెంచిన ధరలు ఇవే..
కార్పొరేషన్‌లో:ఏసీ థియేటర్లలో రూ.145, రూ.175నాన్ ఏసీలో టికెట్ రూ.115, రూ.135స్పెషల్ థియేటర్లలో రూ.175, రూ.200మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.225, రూ. 325
మున్సిపాలిటీల్లో: ఏసీ థియేటర్లలో రూ.135, రూ.155నాన్ ఏసీలో టికెట్ రూ.105, రూ.125స్పెషల్ థియేటర్లలో రూ.135, రూ.175మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.200, రూ. 325
తెలంగాణలో పెరిగిన రూ. 50, రూ.30, రూ.100తో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టికెట్ ధరలు..
రూ.50 పెరిగిన ధరతో సాధారణ ఏసీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ.225, రూ.100.
రూ.30 పెరిగిన ధరతో ఏసీ థియేటర్లలో తర్వాత మూడు రోజులు రూ. 205, రూ. 80.
రూ.100 పెరిగిన ధరతో మల్టీఫ్లెక్స్‌ల్లో మొదటి మూడు రోజులు రూ. 395.
రూ.50 పెరిగిన ధరతో మల్టీఫ్లెక్స్‌ల్లో తర్వాత మూడు రోజులు రూ. 345
రూ. 100 పెరిగిన ధరతో మల్టీఫ్లెక్స్‌ల్లో రాయల్ టికెట్ ధరలు మొదటి మూడు రోజులు రూ.450.
రూ.50 పెరిగిన ధరతో మల్టీఫ్లెక్స్‌ల్లో రాయల్ టికెట్ ధర తర్వాతి మూడు రోజులు రూ.400